తెలంగాణ

ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ప్రభుత్వ విద్యను తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఎబివిపి నగర కార్యదర్శి దిలీప్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల దోపిడీని నిరసిస్తూ గత రెండు రోజులుగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా గురువారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఎబివిపి నేతలు ధర్నా చేశారు. గురువారం నారాయణ విద్యాసంస్థల్లో ఒక విద్యార్థి ఆత్మహత్యను నిరసిస్తూ కూడా బోర్డు ముందు వారు ధర్నా చేశారు. కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్య హామీ ఇంత వరకూ ఆమలు చేయలేదని, రాష్ట్రంలో 25,976 ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతం పైగా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని, మంచినీటికి కూడా నోచుకోవడం లేదని ఎబివిపి నేతలు పేర్కోన్నారు. అలాగే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆర్‌ఐఓలు యాజమాన్యాలతో కుమ్మక్కై చిన్న తరహా కాలేజీలపై దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై టాస్క్ఫోర్సు దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.