తెలంగాణ

దేశం చూపు తెలంగాణ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, మార్చి 25: బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మరని, జనమంతా కారు వైపే ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనె్కపల్లి, సైదాపూర్ గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో రోడ్‌షో దాదాపు 8 వేల మందితో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రావడంలో కేసీఆర్‌తో కలిసి జాతీయ పార్టీలను దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలతో సిఎం కేసిఆర్‌తో కలిసి వినోద్ కుమార్ ఢిల్లీలో చక్రం తిప్పి తెలంగాణను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇలాంటి నాయకున్ని ఎన్నుకుంటే ప్రజలకు భవిష్యత్ ఉంటుందన్నారు. 16 సీట్లు గెలుచుకుంటే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని, అలాగే కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటుంది కాంగ్రెస్, బీజేపీలేనని సూచించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర సంక్షేమ పథకాలకు కోర్టుల చుట్టు తిరిగి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా తీర్చు ఇచ్చారో కారు గుర్తుకు ఓటేసి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల ప్రజలు ఎంపీ వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ సూచించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను 70 వేల పైచిలుకు ఓట్లతో అత్యధిక మెజారిటీ ఇచ్చిన ప్రజలు ఎంపీకి ఓటేసి గెలిపించాలని, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు భవిష్యత్ లేదన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, వావిలాల ఖాదీ బోర్డు డైరెక్టర్ తేరాల గోపాల రావు, సింగిల్‌విండో చైర్మన్ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మునిగంటి స్వామి, చంద శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, రైతు సమన్వయ కమిటీ మండల కో-ఆర్డినేటర్ రావుల రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.