తెలంగాణ

నీటి ఎద్దడి నుంచి పశువులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: వేసివి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి పంచాయతీ రాజ్ అధికారులతో అయన మాట్లాడారు. ఏప్రిల్ నుంచి జూన్ 15వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పశువుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల సమీపాల్లో నీటి తొట్లు లేకపోతే ఉపాధి పథకం ద్వారా పనులు చేపట్టాలన్నారు. పశుగ్రాసం కోసం రైతులకు 50 శాతం పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయాలన్నారు. రైతులు, గొర్లకాపర్లు వేసవి తాపం నుంచి పశువులను ఏ విధంగా రక్షించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం పంపాలన్నారు. ఎండతాపం నుంచి రక్షించేందుకు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య పథకం మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పశువులకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిధులకు కొరతలేదన్నారు. పండ్లతోటల పెంపకం అధికారులతో సమన్వయం చేసుకుని పశుగ్రాసాన్ని జీవాలకు అందుబాటులోకి తీసుకోవాలన్నారు.