తెలంగాణ

మూడు లక్షల మందికి పోలియో వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16:పోలియో వైరస్‌ను అంతం చేసి చూపిస్తామని, ప్రత్యేకంగా గుర్తించిన 13 ప్రాంతాల్లో మూడు లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయిస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో పోలియో వైరస్ బయటపడడంపై మంత్రి అధికారులతో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందే వ్యాధుల నిర్మూలన సంస్థ సౌత్, ఈస్ట్ ఆసియా సలహాదారు డాక్టర్ సునీల్ బహల్ వైద్యశాఖ మంత్రితో పోలియో వైరస్‌పై సమావేశం అయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, నిబంధనల మేరకు వైరస్ మీద యుద్ధం ప్రకటించినట్టు చెప్పారు. ఈనెల 20 నుంచి 26 వరకు వారం పాటు 12 సెక్టార్లలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని చెప్పారు. ప్రపంచంలో తొలిసారి ఐపివి (ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్) ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం చుక్కల ద్వారా మాత్రమే పోలియో నివారించామని, ఇప్పుడు ఐపివి వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువు లోగా వైరస్‌ను నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక పర్యవేక్షణలో 13 సెక్టార్లలో మూడు లక్షల మందికి టీకాలు వేస్తామని చెప్పారు.