తెలంగాణ

డెంటల్ పీజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 26: డెంటల్ పీజీ ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. నీట్ ఎండీఎస్ 2019లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 27వ తేది ఉదయం 10గంటల నుండి ఏప్రిల్ 1వ తేది సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు ఆన్ లైన్ అందుబాటులో ఉంటాయని అన్నారు. దరఖాస్తు అనంతరం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేది దృవ ప్రతాల పరిశీలన ఉంటుందని , ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధిత వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అన్నారు. సాంకేతిక ఇబ్బందులకు 8466924522, 9502001583, 9490585796 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చునని చెప్పారు. పీజీ డెంటల్ ప్రవేశానికి జనరల్ కేటగిరిలో అర్హతకు 250 కటాఫ్ మార్కులు పెట్టినట్లు యూనవర్సిటీ అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 215 కటాఫ్ మార్కులు పెట్టినట్లు తెలిపారు. దివ్యాంగులకు, ఓసీలకు 232 కటాప్ మార్కులు పెట్టినట్లు తెలిపారు.