తెలంగాణ

కేసీఆర్ ప్రసంగాలు ప్రజలకు ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆనాడు ఉద్యమంలో ఇపుడు స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలను కూడగట్టిన ప్రజాకంఠం కేసీర్ అని, ఆయన ఉపన్యాసాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ రూపొందించిన ‘సమ్మోహనాస్త్రం - కేసీఆర్ ప్రసంగాలు’ అనే గ్రంథాన్ని మంగళవారం నాడు కేటీఆర్ తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఒక మాట తుపాకీ తూటా కంటే శక్తివంతమైనదని , ప్రజలను కదిలించే ఉపన్యాసం యుద్ధ ట్యాంకుల కంటే తిరుగులేని శక్తికలదనే దానిని కేసీఆర్ తన మాటలతో , ఉపన్యాసాలతో రాష్టస్రాధన ఉద్యమాన్ని ఏలా నడిపించారో , ప్రజలను ఎలా కదిలించారో, ఎలా గెలిపించారో సమ్మోహనాస్త్రంలో రచయిత వివరించారని కేటీఆర్ పేర్కొన్నారు. అతి క్లిష్టమైన ఆర్ధికాంశాలను వివరించి తన ఉపన్యాసంతో ప్రజలను కేసీఆర్ ఎలా ఒప్పించారో ఇందులో చూపించారు. సమ్మోహనాస్త్రం పుస్తకంలో ఒక విధాన నిర్ణయకర్తగా కేసీఆర్ ఉపన్యాసాలున్నాయని, భాషావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సామాజికవేత్తగా, ఒక సమర్ధుడైన పరిపాలనా దక్షుడిగా ఒక వైజ్ఞానికుడిగా ఆయన ఉపన్యాసాల్లో మనం గమనించగలుగుతామని జూలూరు చూపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎక్సైజ్ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ నారా కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.