తెలంగాణ

29న బీజేపీలోకి జితేందర్‌రెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ నెల 29న మహబూబ్‌నగర్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. 2014లో మహబూబ్‌నగర్ నుండి గెలిచిన జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేతగా వ్యవహరించారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై కేంద్రాన్ని సమర్ధంగా నిలదీశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో షాక్‌కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలవడం కష్టమని ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణంతోనే ఆయనకు టిక్కెట్ నిరాకరించినట్టు చెబుతున్నారు. ఆయన స్థానంలో పారిశ్రామిక వేత్త మనే్న శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇచ్చారు. పార్టీ నిర్ణయంతో అలకబూనిన జితేందర్‌రెడ్డి కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. తనకు పరిచయం ఉన్న కేంద్ర మంత్రుల ద్వారా బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్ జితేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ రానున్నారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతారు. జితేందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడ లోక్‌సభకు పోటీ చేస్తున్న డీకే అరుణ గెలుపునకు దోహదం చేస్తుందని బీజేపీ నేతలు విశే్లషిస్తున్నారు.