తెలంగాణ

16 మంది ఎంపీలు గెలిస్తే మనదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలు సోదిలో లేకపోగా టీడీపీ అసలు పోటీలోనే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ కావాలా? ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, ఏఐసీసీ సభ్యుడు లక్ష్మణ్‌రావుగౌడ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ఇంటి పార్టీ టీఆర్‌ఎస్సేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరాయి పార్టీలన్నారు. ఇంటి పార్టీని గెలిపించుకుంటే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు దొరక్కా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారినే బరిలోకి దించిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ట్రక్కు గుర్తు పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఎంపీగా గెలుస్తానన్న నమ్మకం ఉండి ఉంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేవారన్నారు. నల్లగొండలో చెల్లని రూపాయి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...్భవనగిరిలో ఎలా చెల్లుబాటు అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. జాలీ నోటులాగా భువనగిరిలో చోరబడ్డ కోమటిరెడ్డిని ఓడించి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిసిస్తే ఇక్కడి ప్రజల చెప్పినట్టు నడుచుకుంటారన్నారు. అదే కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు గెలిస్తే రాహుల్, మోదీ చెప్పినట్టు వింటారన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది గెలిచాక వారికి ఢిల్లీలో మరో 150 మంది ఎంపీలు తోడు అవుతారన్నారు. కాంగ్రెస్, బీజేపేతర పార్టీలతో కలిసి తమ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారన్నారు. దేశానికి కావాల్సింది చౌకీదారు...టెకేదార్ కాదు...కేసీఆర్‌లాంటి జిమ్మేదారు కావాలన్నారు. జై కిసాన్ కాంగ్రెస్, బీజేపీలకు నినాదమైతే అది టీఆర్‌ఎస్‌కు విధానమన్నారు.
చిత్రం.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్