తెలంగాణ

అసదుద్దీన్ నామినేషన్‌ను తిరస్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ నుండి ఎంఐఎం అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ తన అఫిడవిట్‌లో కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచారని, అలాగే ఆయన ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదయ్యారని కనుక ఆయన అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించాలంటూ బీజేపీ అభ్యర్ధి భగవంతరావు ఎన్నికల సీఈఓకు, హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రెండు అంసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉందని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తమ పేర్లు రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారని, వాస్తవానికి ఆ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని భగవంతరావు పేర్కొన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు నుండి ఆయన బోర్డు సభ్యుడి హోదాలో వేతనాలు పొందుతున్నారని, ఈ విషయం కూడా ఆయన అఫిడవిట్‌లో వెల్లడించలేదని చెప్పారు. ఆస్తుల విలువను సైతం తక్కువ చేసి చూపించారని, ఒకే పార్టీ నుండి ఒకే స్థానానికి ఇద్దరు అభ్యర్ధులు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయడం అనైతికమని వివరించారు.