తెలంగాణ

కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఆమె టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావుతో మంతనాలు జరిపారు. దీంతో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బి.బిక్షమయ్య గౌడ్‌పై, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్ కుమార్ గౌడ్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
గద్దర్‌తో కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గద్దర్‌ను ఆయన నివాసంలో కలిసి చర్చించారు. తనకు మద్దతునివ్వాలని, ప్రచారంలో పాల్గొనాలని వెంకటరెడ్డి ఆయనను కోరారు.