తెలంగాణ

రైతుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, మార్చి 26: రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, ఆటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శివరంజని కళ్యాణ మండపంలో పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయం పెంచిందని అన్నారు. పెన్షన్‌లను సహితం రెట్టింపు చేసిందని, ఎన్నికల తరువాత లబ్దిదారులకు అందించడం జరుగుతుందని వెల్లడించారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు చూసి మహరాష్టల్రోని 40 గ్రామాలు విలీనం అవుతామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఇటీవలే నిజామాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో 25 మంది సర్పంచ్‌లు తెలంగాణలో చేర్చాలని కోరారని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతులను అన్నివిధాలుగా అదుకోవడానికి రైతుబంధు, రైతుబీమా, ఖరీప్ సీజన్‌లో సత్వరమే రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవలే జరిపిన సర్వేలో దేశంలోనే ముఖ్యమంత్రి కేసీ ఆర్ మొదటి స్థానంలోనిలిచారని తెలిపారు. కాళేశ్వరంతో రైతులకు సాగు నీళ్లు పుష్కలంగా అందుతాయని అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు రక్షిత తాగునీళ్లు అందించడానికి మిషన్ భగీరథను ప్రవేశపెట్టడం జరిగిందని త్వరంలోనే నీళ్లు సహితం అందిస్తామని వివరించారు. ప్రస్తుతం 1600 టీ ఎంసీల నీళ్లు వృధాగా పొతుందని అన్నారు. 300 టీ ఎంసీల నీళ్లతో చెరువులు, డ్యాంలు పూర్తిగా నించడం జరుగుతుందని తెలిపారు. పొచంపాడ్ ప్రాజెక్టు నుండి గడ్డెన్నవాడు ప్రాజెక్టు నీళ్లు తీసుకు వస్తామని అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని 15000 ఎకరాలకు సాగునీళ్లు అందిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తెరాస ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యువతకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు అంతంత మాత్రంగా అందించారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి స్థానిక సామాజిక ఆస్పత్రిని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిగా ఉన్నతీకరించాలని, ముధోల్‌లో అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయాలని కోరారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సానుకులంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శోభాసత్యనారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి