తెలంగాణ

మన ఊరు సంగతి చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ‘రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నారు, మరి మన ఊరి సంగతి ఏమి చేశార’ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ఆయన సొంత ఊరికి చెందిన చింతకమడక వాసులు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సిద్ధిపేట మండంలోని చింతకమడక ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత గ్రామమన్న విషయం తెలిసిందే. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు గురువారం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చింతకమడకను మండలంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను త్వరలోనే చింతమడకను సందర్శించి గ్రామాన్ని అభివృద్ధి చేసే అంశంపై చర్చించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో మండలాల పునర్ వ్యవస్ణీకరణలో భాగంగా కొత్త మండలాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త మండలాల ప్రతిపాదనలో చింతమడకను కూడా అధికారుల పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.