తెలంగాణ

గుత్తాపై స్పీకర్‌కు ఫిర్యాదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయించిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిపై అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో తెరాస సాగిస్తోన్న ఫిరాయింపుల రాజకీయాలను జాతీయ స్థాయిలో చర్చ చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచి, ఇటీవలే కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు సూచించగా, తాను లోక్‌సభలో పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. పీసీసీ నుంచి కూడా పార్టీ నాయకత్వానికి ఒక లేఖ రాయాలని ఆయన సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు గుత్తా సుఖేందర్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో చేరినప్పుడు, అంతకుముందు వివేక్‌తో కలసి మీడియాతో మాట్లాడిన ఎలక్ట్రానిక్, పేపర్ క్లిప్పింగులను కూడా స్పీకర్‌కు అందచేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. దాని ద్వారా, మళ్లీ అక్కడ ఉప ఎన్నిక జరిపించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. . కాగా, బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలో తెరాస సాగిస్తోన్న ఫిరాయింపుల రాజకీయాలను, దేశ రాజధాని వేదికగా చర్చనీయాంశం చేయాలని నిర్ణయించింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై వల వేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకత్వం.. తెరాసను నైతికంగా దెబ్బతీయాలన్న నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఢిల్లీ వేదికగా ఫిరాయింపుల వ్యవహారంపై చర్చించాలని భావిస్తోంది.