తెలంగాణ

కేశవదాసు విగ్రహాన్ని నెలకొల్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: వెండి తెరకు తొలి గేయాన్ని రాసిన చందాల కేశవదాసు విగ్రహాలను ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఆయన సమాధి ఉన్న నాయకనగూడెంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.కేశవదాసు నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని తమ్మరబండ పాలెంలో ప్రతిష్టాత్మకమైన సీతారామచంద్ర దేవాలయం నిర్మించారు. ఆయన రాసిన తొలి గేయాన్ని ఆయన సమాధి వద్ద శిలాఫలకంపై చెక్కించాలని, అదేవిధంగా తొలి తెలంగాణ జాతీయ గీతాన్ని రాసిన రావెళ్ల వెంకట్రామారావు విగ్రహాన్ని కూడా నెలొకొల్పాలని, ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయ సంస్థకు ఆయన పేరు పెట్టాలని గౌరీశంకర్ ప్రభుత్వాన్ని కోరారు. విస్మరించబడిన సాహితీమూర్తులను భావితరాలకు తెలియజేసేందుకు వారి పేరున స్మృతి కేంద్రాలను నెలకొల్పాలని కోరారు.