తెలంగాణ

కల్యాణ లక్ష్మి లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వమే పథకాల విధివిధానాలు రూపొందించాలని, వీటిని అధికారులు అమలు చేయాలని సూచించారు. రెండింట్లోనూ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమై పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదోళ్లంతా టిఆర్‌ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గులాబీకి గులాం అయ్యే పరిస్థితి దాపురించిండం వల్ల సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు వెంటనే చెల్లించాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యక్ష రాజకీయ జోక్యం ఉండకూడదని, ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిత్యావసర ధరలను అరికట్టండి..
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను అరికట్టాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం నారాయణ గూడ చౌరస్తాలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సృజన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయని, సామాన్యుడి నెత్తిపై కుంపటిలాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.