తెలంగాణ

ఎక్కువ సీట్లలో గెలవబోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం ఈ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనపడందన్నారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ క్రియాశీలపాత్ర వహించనున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ ఈఅని చెప్పారు. ఇప్పటికే టీడీపీ గల్లంతైందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు మాత్రమే ఉంటాయన్నారు. తాము అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబానికి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చనున్నాయన్నారు. వచ్చే నెల 23 తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాలతో బీజేపీ నేతలపై రాష్ట్రంలో కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరవపించారు. పార్టీ నిధిని అధికారికంగా డ్రా చేసినా పోలీసులు అతీగా వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఉనికిని చాటే ప్రయత్నం చేసిందన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారన్నారు.
రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్‌కు, ఆంధ్రాలో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. ఓటమి భయంతోనే తమ పార్టీ నేతలపై ఎడాపెడా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు కూడా చేశారన్నారు. తమ పార్టీ నిధులు లీగల్ సొమ్ము అని ఆదాయం పన్ను శాఖ అధికారులు క్లియరెన్సు ఇచ్చారన్నారు.