తెలంగాణ

శిక్షణ లేని సిబ్బంది.. జనానికి ఇబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో లోక్‌సభకు గురువారం జరిగిన పోలింగ్‌లో పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదని వివిధ జిల్లాల నుండి సమాచారం అందింది. నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా, చాలా చోట్ల 15 నిమిషాల నుండి అరగంట వరకు జాప్యం జరిగింది. అన్ని కేంద్రాల్లో ఉదయం 5.30 నుండి 7 వరకు మాక్ పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ బుధవారం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. అయితే 80 శాతం కేంద్రాల్లో ఈ సమయానికి మాక్ పోలింగ్ జరగలేదు. నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల మాక్ పోలింగ్ జరగలేదు. పోలింగ్‌కోసం నియమించిన సిబ్బందిలో చాలా మందికి ఎలాంటి శిక్షణా ఇవ్వలేదని స్పష్టమైంది. బిఎల్‌ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్) అంటే ఏమిటి అని చాలా చోట్ల సిబ్బంది ప్రశ్నించారు.