తెలంగాణ

పోరు సాగించాం.. పోటీలో నిలిచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో, ఇతర స్వతంత్ర వ్యక్తులు, సంస్థల సహకారంతో మిగిలిన పార్టీలకు ధీటుగా గట్టి పోరు సాగించామని, పోటీలో నిలిచామని జనసేన సికింద్రాబాద్ అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీఎస్పీ అభ్యర్ధులు ఐదు చోట్ల, జనసేన అభ్యర్ధులు ఆరుచోట్ల పోటీలో నిలిచారు. ఆదిలాబాద్ నుండి దరావత్ నరేందర్ నాయక్, మల్కాజ్‌గిరి నుండి బొంగునూరి మహేందర్‌రెడ్డి, నల్గొండ నుండి మేకల సతీష్‌రెడ్డి, మహబూబాబాద్ నుండి భాస్కర్ నాయక్ భూక్యా, ఖమ్మం నుండి నారల సత్యనారాయణలు ఎన్నికల బరిలో నిలిచారు. జనసేన మద్దతుతో పెద్దపల్లి నుండి పీ బాలకళ్యాణ్ , కరీంనగర్ నుండి వెంకన్న అనగండ్లలు బీఎస్పీ అభ్యర్ధులుగా పోటీ చేశారు. చేవెళ్ల నుండి విజయ్, నాగర్ కర్నూలు నుండి బీ యూసుఫ్, వరంగల్ నుండి బోళ్లపల్లి సారయ్య బీఎస్పీ అభ్యర్ధులుగా పోటీ చేశారు. గెలుపు ఓటములు కంటే ఎన్నికల బరిలో నిలిచి గట్టి పోటీ ఇవ్వడమేగాక, జనసేన సిద్ధాంతాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వారు చెప్పారు.