తెలంగాణ

ప్రముఖుల ఓట్లన్నీ జూబ్లీహిల్స్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: పార్లమెంట్ ఎన్నికలకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఇతర వృత్తి నైపుణ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ నగరంలోని ప్రముఖులు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు.
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీరంగ ప్రముఖులు ఎక్కువ మంది నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసం ఉండటంతో అక్కడి పోలింగ్ బూతులకు సెలబ్రిటీల కళ వచ్చింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆయన భార్య శైలిమ జూబ్లీహిల్స్‌లో నందినగర్ జిహెచ్‌ఎంసి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, సంగీత దంపతులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 13లో నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో, అదే నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డి, సీతా దంపతులు, కుమార్తె పూజా ఎమ్మెల్యే కాలనీ సెంట్రల్ నర్సరీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మంత్రి మల్లారెడ్డి దంపతులతో పాటు మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి దంపతులు బోయినపల్లిలో సెంట్ పీటర్స్ స్కూల్‌లో ఓటు వేశారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో ఓటు వేశారు. అలాగే సినీరంగ ప్రముఖులు చిరంజీవి దంపతులు, ఆయన కుమారుడు హీరో రాంచరణ్ తేజా-ఉపాసన దంపతులు, హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, హీరో వెంకటేశ్, హీరో రవితేజా, హీరో మంచు మనోజు, సోదరి మంచు లక్ష్మీ, హీరో నాగార్జున భార్య అమల, నటుడు కోటా శ్రీనివాసరావు తదితరులంతా జూబ్లీహిల్స్‌లోని వివిధ పోలింగ్ బూత్‌ల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చిత్రాలు.. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, సంగీత దంపతులు
* టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, సీతా దంపతులు, కుమార్తె పూజా