తెలంగాణ

ఓట్లు వేసిన ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు విద్యావేత్తలు, వర్శిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యానిపుణులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య విద్యానగర్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు సహా పలువురు ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లు తార్నాకలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొంత మంది ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినయోగించుకున్నారు.. ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ తమ ఓటును ఉప్పల్‌లో వినియోగించుకున్నారు. తెలుగు యూనివర్శిటీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కే యాదగిరి హన్మకొండలో తమ ఓటు వినియోగించుకున్నారు.
* చిక్కడపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ * కాచిగూడలో సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సికింద్రాబాద్‌లోని చిక్కడపల్లి శాంతినికేతన్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తన కుటుంబ సభ్యులతో వెళ్లి డాక్టర్ లక్ష్మణ్ ఓటు వేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జీ కిషన్ రెడ్డి కాచిగూడలో లింగంపల్లి ఎక్స్ రోడ్డులో దీక్ష మోడల్ స్కూలులో కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటును వేశారు. సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాంనగర్‌లోని జేవీ హైస్కూలులో కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దంపతులు కోదాడలోని ఈవీ రెడ్డి కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి మధిరలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలులో ఓటు వేశారు.
చిత్రాలు.. సినీనటి అమల, దగ్గుబాటి రానా