తెలంగాణ

రవాణాశాఖకు సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: రవాణాశాఖను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుస్తూ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి అన్నారు. రూ. 25 కోట్లతో రవాణాశాఖకు చెందిన కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. శనివారం మనే్నగూడ డ్రైవింగ్ ట్రాక్‌ను ఆయన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్ట్ర దేశంలో ఎక్కడా లేనివిధంగా రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో 88 లక్షల వాహనాలున్నాయని వాటిలో సగ భాగం ద్విచక్ర వాహనాలుండి ప్రమాదాలు సైతం అధిక స్థాయిలోనే జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. హెల్మెట్లు లేకుండా ప్రయాణం సురక్షితం కాదని దీనిపై అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రవాణాశాఖలో అవినీతి నిర్మూలన, దళారీ వ్యవస్థల సమూలంగా నివారించి పారదర్శకత పెంచేందుకు చెక్ పోస్టులు, కార్యాలయాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టిన వ్యాలెట్ సదుప్రాయాలు ప్రజలకు రవాణాశాఖ వివరాలను అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని, కేవలం కొన్ని నెలల్లో పది లక్షల మంది యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం అందుకు నిదర్శనమన్నారు. రంగారెడ్డి జిల్లాలో రూ. 12 కోట్లతో మణికొండ, పరిగి, మనె్నగూడ ప్రాంతాలలో రవాణాశాఖకు సొంత భవనాలు నిర్మించతలపెట్టామన్నారు. హైదరాబాద్‌లోని 12 ఆర్టీఏ కార్యాలయాల స్థాయిని పెంచుతూ యూని ట్ కేంద్రాలుగా మార్చనున్నట్టు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.

చిత్రం మనే్నగూడలో డ్రైవింగ్ ట్రాక్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి