తెలంగాణ

పోలీసు అభ్యర్థులకు 20, 21న రాత పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించిన వివిధ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షలను ఈనెల 20,21 తేదీల్లో నిర్వహించడానికి నియామక బోర్డు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1200 ఎస్‌ఐ పోస్టు ఉద్యోగాలతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు పోలీస్ నియామకపుబోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావువెల్లడించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి 2018లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల కోసం దాదాపు4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత లక్షా 10వేలకు పైగా అర్హత సాధించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉం ది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్‌ఐ రాత పరీక్షల్లో తొలిరోజు అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఆంగ్ల భాషలో పరీక్షలు ఉం టాయి. రెండోరోజు జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రాత పరీక్షలు ఉంటాయి. ఎస్‌ఐకు సమానంగా ఉన్న ఇతర ఉద్యోగాలకు ఏప్రిల్ 27న సాంకేతిక పరీక్షలుంటాయని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 15 నుంచి 18వ తేదీలోగా అభ్యర్థులు పొందవచ్చు. రాత పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు విధిగా తమ హాల్‌టికెట్లతో పాటు అభ్యర్థి పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో పాటు విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను వెంట తెచ్చుకోవాలన్నారు. రాత పరీక్షల్లో 1/4 మైనస్ మార్కులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలని సూచించారు.