తెలంగాణ

రైతు సమస్యలపై పోరు రైతు సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రైతాంగ సమస్యలపై ఎడతెగని పోరు సాగిస్తామని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పి జంగారెడ్డి , కార్యదర్శి టీ సాగర్‌లు పేర్కొన్నారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు చెప్పానరు. 1936 ఏప్రిల్ 11న ఏర్పడిన కిసాన్ సభ 83 సంవత్సరాలు గడిచినా నేటికీ రాజీలేకుండా రైతాంగ సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉందని వారు శుక్రవారం నాడు ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. 2017లో మహారాష్ట్రంలో 50వేల మందితో నాసిక్ నుండి ముంబైకి 10 రోజులు చారిత్రాత్మక యాత్రను కిసాన్‌సభ నిర్వహించిందని, 2018 సెప్టెంబర్ 5న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కిలిసి రెండు లక్షల మందితో ఢిల్లీలో రుణాల రద్దు, గిట్టుబాటు ధరల అమలుకు చట్టాలు చేయాలని ధర్నా చేసిందని వారు గుర్తుచేశారు. ఆ పోరాటాల ఫలితంగానే 13 రాష్ట్రాల్లో ఎన్నికల పేరుతో రైతులకు 3.83 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలను రద్దుచేశారని అన్నారు. 1946లో తెలంగాణ సాయుధ పోరాటం, పొన్నప్రావయలర్ పోరాటం మహారాష్టల్రో వర్లి పోరాటం , గోదావరి పరూలేఖర్ నాయకత్వాన బెంగాల్‌లో కౌలు రైతుల పోరాటం, పంజాబ్‌లో బెటర్‌మెంట్ టాక్సీ వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటా ల్లో ముందుండి నడిపింది ఎఐకేఎస్ మాత్రమేనని అన్నారు. మరింత ఉత్సాహంతో , పోరాట పటిమతో రైతులు తమ సమస్యల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ నిరసన తెలిపిన రైతాంగ నాయకులు, రైతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి కిసాన్ సభ జండాను ఎగురవేశారు. సభలో అరిబండి ప్రసాదరావు, వెంకటరాములు ఇతర నేతలు పాల్గొన్నారు.