తెలంగాణ

సిఎంగారూ..కళ్లు తెరవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కళ్లు తెరవాలని, కేంద్రం అందజేస్తున్న సాయాన్ని అర్ధం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా తెలంగాణలో పాలన సాగుతోందని, కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చుచేయలేకపోతున్న ప్రభుత్వానికి నిధులు ఇంకా ఇవ్వమని అడిగే హక్కు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం 90వేల కోట్లు ఆర్ధిక సాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్షకోట్లు అప్పులోకి తీసుకుపోయిందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిథులను వెచ్చించకుంటే ఉద్యమ బాట తప్పదని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ వైఫల్యాలను కార్యకర్తలు ఎలుగెత్తి చాటాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని, సుదీర్ఘపోరాటానికి నాంది పలకాలని అన్నారు. భౌగోళికంగా , సామాజికంగా పార్టీని విస్తరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రజలకోసం పాటుపడదాం..పల్లెబాట పడదాం..ప్రజలకు చేరువు అవుదాం అని లక్ష్మణ్ అన్నారు. సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరో పక్క ప్రధాని నరేంద్రమోదీ విజయాలను ప్రజలకు వివరించాలని ఆయన హితవుపలికారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రెండేళ్లలో టిఆర్‌ఎస్ చేసింది కేవలం ఓట్లు-సీట్లు-నోట్లు- వెన్నుపోట్లు మాత్రమేనని, అనేక ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అధికార పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు క్యాడర్ లేదని, లీడర్లు లేరని, కేవలం సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చామనే భావనతో, ప్రభుత్వం నిలబడదేమో అన్న అభద్రతా భావంతో కనిపించిన ప్రతివారికీ కండువా కప్పే సంప్రదాయానికి తెరతీసిందని అన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోందని, ముఖ్యమంత్రి మాత్రం వెన్నుపోట్లను ప్రోత్సహిస్తున్నారని, గత ఎన్నికల సందర్భంగా సిఎం ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు అన్నీ నీటిమూటలుగా మారాయని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కెజిటు పిజి ఉచిత విద్య వంటి హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు.
వాస్తు చూసుకుని కెసిఆర్ పాలన: పారికర్
వాస్తుచూసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాలన చేస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. శనివారం నాడిక్కడ ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బిజెపి తొలి కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పారికర్ అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వస్తోందని, తెలంగాణలో మాత్రం ఎందుకు రాదని ప్రశ్నించారు. తెలంగాణలో ముఖ్యమంత్రిది వాస్తు పాలనేనని, ఇక్కడ విపక్షానికి బోలెడంత అవకాశం ఉందని, బిజెపి ఎదిగేందుకు అధికారపక్షమే అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ యథేచ్చగా ఫిరాయింపులకు పాల్పడుతోందని , ఇపుడు పార్టీలో చేరిన వారంతా చివరి ఏడాది మళ్లీ తిరుగుముఖం పడతారని అన్నారు. పార్టీకి సమాచారం ఇవ్వడంలో కొంత లోపం జరిగిందని గుర్తుచేసిన పారికర్ ఆంధ్రరాష్ట్ర పునర్విభజన తర్వాత ఏ నాయకుడు ఏ రాష్ట్రాంలో ఉన్నారనేది తనకు కొంత అయోమయానికి గురిచేసిందని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి లోపం లేకుండా సరిదిద్దుకుంటానని అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గోవాలో 0.4 శాతం ఉన్న ఓటింగ్ పరిస్థితిని అధిగమించి చివరికి అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో ఇప్పటికే 14-15 శాతం ఓటింగ్ ఉందని అన్నారు. బిజెపి అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని , ఆ తర్వాతనే ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని అన్నారు. అంతకుముందు పదే పదే కిషన్‌రెడ్డి వైపు చూసి రాష్ట్ర అధ్యక్షుడు అని సంబోధించడంతో మిగిలిన నాయకులు అంతా డాక్టర్ కె .లక్ష్మణ్ వైపు చూశారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి , పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.
రెండు తీర్మానాలు
ఈ సందర్భంగా పార్టీ రెండు తీర్మానాల ముసాయిదాలను ప్రవేశపెట్టి చర్చకు జరిపింది. తీర్మానాలను ఆదివారం నాడు ఆమోదించనున్నారు. కాగా ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు.