తెలంగాణ

స్కూల్ బస్సు కిందపడి బాలిక దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 18: స్కూల్ బస్సు కిందపడి చిన్నారి బాలిక మృతి చెందింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం నాగులపల్లి రోడ్డులోని ఈద్గా వద్ద శనివారం ఉదయం జరిగింది. కాలనీవాసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు రోజూ మాదిరిగానే పిల్లలను ఎక్కించుకొని పాఠశాలకు తీసుకువెళ్లేందుకు వచ్చింది. పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు బస్సులో ఎక్కుతుండగా వారితో పాటు చిన్నారి నందిని అనే రెండేళ్ల బాలిక ఆకస్మాత్తుగా స్కూల్ బస్సు కిందకు వెళ్లింది. ఈ విషయం గమనించని బస్సు డ్రైవర్ వెంకటేష్ యధావిధిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టుపక్కల వాళ్లు పెద్దగా అరవడంతో స్కూల్ బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. బస్సు ఫుట్‌బోర్డు తగిలి తీవ్రంగా గాయపడిన చిన్నారి నందినిని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అప్పటికే నందిని మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో పాటు యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పాఠశాల పేరును పొందుపరిచి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు ఎన్నో తిరుగుతున్నాయని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆర్టీఓ అధికార్ల సైతం నమోదు చేయాలని, షాద్‌నగర్ డిప్యూటీ డిఇఓను విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ సూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం : డిప్యూటీ డిఇఓ
చిన్నారి బాలిక నందిని మృతికి కారణమైన పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో పాటు యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ డిప్యూటీ డిఇఓ పాపయ్య వివరించారు. ఈ ప్రమాద వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు, తక్షణమే ఈ పాఠశాలపై చర్యలు తీసుకొని పాఠశాలను మూసివేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే పాఠశాలను మూసివేయడంతో పాటు యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివరించారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి బాలిక నందిని (2) అనే చిన్నారి మృతి చెందిందని షాద్‌నగర్ టౌన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వివరించారు.

చిత్రం ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సు, ఇన్‌సెట్‌లో మృతి చెందిన చిన్నారి నందిని