తెలంగాణ

భూనిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 18: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసే కరణ తీరును నిరసిస్త్తూ ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కావాలనే వివిధ జిల్లాల్లో ప్రాజెక్టుకు మద్దతుగా ఆందోళన చేయించడం ఎంతవరకు సమంజసమని భూనిర్వాసిత గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. శనివారం తొగుటలో పిఎసిఎస్ చైర్మన్ మల్లేశం, సర్పంచ్ శ్రీనివాస్, డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పరిపూర్ణాచారి, మల్లేశం, రంగారెడ్డి, నర్సింహరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తే తాము వ్యతిరేకం కాదని, తమ భూములు పోయి నిరాశ్రయులవుతున్నామనే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు వద్దని ఆందోళన చేస్తున్న తమ బాధ కావాలని ఆందోళన చేస్తున్నవారికి ఎలా అర్థమవుతుందన్నారు. నష్టపోయే భూములకు బదులు తమ గ్రామాల్లో భూములు ఇస్తామన్నారు. రైతుకు భూమి లేకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. అన్నీ త్యాగం చేస్తున్న తమ బాధను అర్థం చేసుకొని మీరు చేయూతనివ్వాల్సిందిపోయి ఇష్టారీతిగా మాట్లాడడం తగదన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం
మల్లన్నసాగర్‌కు అనుకూలంగా వివిధ జిల్లాల్లో చేయిస్తున్న ఆందోళనలను నిరసిస్త్తూ, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో చేపట్టిన దీక్షకు మద్దతుగా నిర్వాసిత గ్రామాలైన పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను ఊరేగించి దగ్ధం చేశారు. తొగుటలో సైతం నిర్వాసిత గ్రామస్థులు ర్యాలీ తీసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సమావేశంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న భూనిర్వాసిత రైతులు