తెలంగాణ

ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, ఏప్రిల్ 17: ముప్ఫై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి పట్టాపాస్ పుస్తకాలు సృష్టించుకునేందుకు యత్నించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన ఓ నాయకుడి బాగోతం స్థానికుల చొరవతో బయటపడింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాక్లూర్ తహశీల్దార్ భూపతి, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి, స్థానిక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌తో కలిసి బుధవారం మండలంలోని కల్లెడి శివార్లలో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. కాగా, నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామానికి చెందిన జీవనన్న యువసేన ప్రతినిధిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి గత కొంతకాలం నుంచి ఈ భూమిపై కనే్నశాడు. తనకు పరిచయం ఉన్న స్థానిక నేతల ద్వారా అట్టి భూమికి సంబంధించిన వివరాలు సేకరించిన సదరు వ్యక్తి, 30 ఎకరాల విస్తీర్ణంలో భూమిని చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనిని గమనించిన పలువురు స్థానికులు భూమిని ఎందుకు చదును చేస్తున్నావని ప్రశ్నించగా, వారికి పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చాడు. కొంతమందికి ఈ భూమిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కొనుగోలు చేశారని, మరికొందరికి జీవన్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డికి తానే ఇప్పించినట్లు చెప్పాడని కల్లెడి గ్రామస్థులు అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన ఓ టీఆర్‌ఎస్ నేత నేరుగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి, ఆయన సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అట్టి భూమితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మాక్లూర్ రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకు వేసి 570సర్వే నెంబర్‌లో సర్వే చేయించగా 131ఎకరాల అటవీ భూమి ఉందని గుర్తించారు. ఇందులో నుండే నందిపేట మండలానికి చెందిన సదరు వ్యక్తి 30ఎకరాలు కబ్జా చేసి పట్టాపాస్ పుస్తకాలకై తహశీల్దార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు గుర్తించారు. పట్టాపాస్ పుస్తకాల విషయంలో కబ్జాదారు వ్యవహరించిన తీరుతో అనుమానం వచ్చినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
ఇదిలాఉండగా, తాను కల్లెడి గ్రామానికి చెందిన 15మంది రైతుల వద్ద ఇట్టి భూమిని కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకే తహశీల్దార్‌ను కలిశానే తప్ప, పట్టాపాస్ పుస్తకాల కోసం కాదని భూ కబ్జాకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేర్కొనడం కొసమెరుపు. కబ్జాకు గురైన 30ఎకరాల అటవీ భూమిని తిరిగి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని రెవెన్యూ అధికారి తిరుపతిరెడ్డి వివరించారు.