తెలంగాణ

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 18: ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అంతా ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకుంటుందని, ఈ విషయంలో అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులోని పీఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాల వర్షాలతో రాష్ట్రంలో అనేక చోట్ల రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ఒక్క రైతు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేస్తామన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్టవ్య్రాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తమై టార్పాలిన్‌లను అం దుబాటులో ఉంచామన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన రైతాంగానికి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకొని ఇప్పటి వరకు 1.44లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఆరబెట్టుకొని తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా సరిపడా లారీలను అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే కొనుగోళ్లు చేయడంతో పాటు చెల్లింపులు కూడా వెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.
చిత్రం...సూర్యాపేట మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడుతున్న పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్