తెలంగాణ

పాఠశాల ముందు విద్యార్థి మృతదేహంతో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఏప్రిల్ 18: వనపర్తి జిల్లా వనపర్తి మండలం నాగవరం పీఎస్ సింధూజ పాఠశాల ముందు గురువారం విద్యార్థి మృతదేహంతో ధర్నా చేశారు. విద్యార్థి మృతికి యాజమాని కారణమని వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 14న పాఠశాల యజమాని శ్రీనివాస్‌రెడ్డి తన పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వంశీ (9) అనే విద్యార్థిని మద్యం మత్తులో ఇష్టానుసారంగా కొట్టాడని, ఆ దెబ్బలకు విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులను పిలిచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. కోడేరు మండలం వాల్యాతాండాకు చెందిన ఆ విద్యార్థి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మృతి చెందగా గురువారం పాఠశాల ముందు మృతదేహాన్ని ఉంచి విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్మి హనుమంతుతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు, గిరిజన సంఘం నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సుమారు సాయంత్రం దాకా మృతదేహాన్ని పాఠశాల ముందు ఉంచి ధర్నా చేసి యాజమానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సీఐ సూర్యనాయక్, రూరల్ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు లక్ష్మి హనుమంతులు ఫిర్యాదు చేసినట్లు, తమకు ఎవ్వరిపై అనుమానం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
చిత్రం...పాఠశాల ముందు విద్యార్థి మృతదేహంతో ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల నేతలు