తెలంగాణ

‘ప్రజాస్వామ్యం’ పాఠం తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: తొమ్మిదో తరగతిలోని పాఠ్యపుస్తకం నుండి ప్రజాస్వామ్యం పేరిట ఉన్న పాఠ్యాంశాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవిద్యారంగంలో మతతత్వ, మనువాద భావజాలాన్ని జొప్పించేందుకు బీజేపీ మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్‌లు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యారంగం, చరిత్ర పాఠ్యాంశాలను పూర్తిగా మర్చివేసేందుకు పూనుకుంటోందని, గత ఐదేళ్లుగా విద్య కాషాయికరణ విధానాలకు పాల్పడుతోందని అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ సభ్యులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఆరెస్సెస్ అనుకూలమైన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా విమర్శించింది. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సోషలిజయం అనే పదాలు ప్రభుత్వానికి నచ్చడం లేదని, ఆ కుట్రలో భాగంగానే ఇలాంటి నీఛానికి ఒడిగడుతున్నారని, ప్రజాస్వామ్య దేశంలో నేడు విద్యారంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ చరిత్ర పాఠ్యాంశాలను తొలగించాలనే కుట్రపూరిత విధానాలకు స్వస్తిపలకాలని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికతత్వం పరిరక్షంకు మరింతగా ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు.