తెలంగాణ

మగవారి వంద్యత్వానికి జన్యుకారణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: మగవారిలో వంద్యత్వానికి అనేక కారణాలు ఉంటాయని, అయితే జన్యుకారణాలే ఇపుడు ప్రధానంగా గోచరిస్తున్నాయని సీసీఎంబీ ప్రొఫెసర్ కే తంగరాజ్ అంటున్నారు. గత రెండేళ్లుగా ఆయన నిర్వహించిన అనేక పరిశోధనల్లో మగవారి వంద్యత్వానికి శుక్రము ఆకారంలోనూ, పనితీరులోనూ, శుక్రము ప్రయాణించిన దిశను నిరోధించే అడ్డంకుల కారణంగానో, అనారోగ్యం, గాయాలపాలవ్వడం వల్లనో, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వల్లనో, జీవనశైలి వల్లనో వంద్యత్వం ఏర్పడుతుందని, అయితే తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో జన్యుపరమైన కారణాలే ఎక్కువగా గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రతి ఏడు జంటల్లో ఒకరు వంద్యత్వంతో బాధపడుతున్నారని, ఈ వంద్యత్వానికి 50 శాతం వరకూ మగవారే కారణమని ఈ పరిశోధనల్లో తేలిందని అన్నారు.