తెలంగాణ

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జరిగిన అవకతవకలపై ఉన్నత స్థాయి కమిటీ చేత దర్యాప్తుచేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) గవర్నర్‌ను డిమాండ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 18,435 పోస్టులకు 7.19 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. కాని రేడియోఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) పరికరం ద్వారా శారీర దారుడ్య పరీక్షల అర్హతను నిర్థారించడం పెద్ద ఫార్సు అని, ఇందులో స్కాం చోటుచేసుకుందన్నారు. ఈ మేరకు వినతిపత్రాన్ని ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ గవర్నర్‌కు పంపారు. లోపాలకు తావులేకుండా, శాస్ర్తియ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌లో శారీర దారుడ్య పరీక్షలను నిర్వహించలేదు. 2.24లక్షల మంది అభ్యర్థులు శారీర దారుడ్య పరీక్షలకు హాజరైతే, 1,76 లక్షల మందిని ఎంపిక చేశారన్నారు. ఈ పరీక్షలనునిర్వహించిన విధానంలో లోపాలు ఉన్నాయన్నారు. ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా శారీర దారుడ్య పరీక్షలను నిర్థారించే బాధ్యతను ఈ సాఫ్ట్ ఏజన్సీకి అప్పగించచారన్నారు. అర్హులైన అభ్యర్థులు కూడా ఈ పరీక్షల్లో అనర్హులయ్యారు. 800 మీటర్ల పరుగుపందెంలో అవకతవకలు జరిగాయని దాసోజు శ్రావణ్ చెప్పారు. ఒక పరుగుపందెంలో 4 నుంచి 6 అభ్యర్థులకు అనుమతించాలన్నారు. కాని 60 మంది అభ్యర్థుల వరకు అనుమతించారని చెప్పారు. నోటిఫికేషన్‌లో ఆర్‌ఎఫ్‌ఐడీ ప్రస్తావన లేదన్నారు. ఒకరి బదులు మరొకరు పరుగుపందెంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. 2016లో ఎత్తు సరిపోయిన ఒక యువతిని 2018 రిక్రూట్‌మెంట్‌లో తగిన ఎత్తులేవన్నారని చెప్పారు. అలాగే 168 సెం.మీ ఎత్తు ఉన్న ఒక యువకుడి ఎత్తు 172.5 సెం.మీ ఉందని చెప్పి ఎంపిక చేశారన్నారు.