ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాజధానిలోని పంజాగుట్ట సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విగ్రహం కూల్చివేతకు నిరసనగా గురువారం ఇక్కడ ట్యాంక్‌బండ్‌పై బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నెక్లెస్ రోడ్డులో 125 అడగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం స్థాపనకు చర్యలుతీసుకోవాలని కోరారు. నాలుగేళ్ల క్రితం ఈ హామీ ఇచ్చారని, కాని ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామ్య వాతావరణం నెలకొని ఉందని, ప్రశ్నించేవారిని నిర్బంధించడం అమానుషమన్నారు. బీజేపీ సీనియర్ నేత జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంబేద్కర్ జయంతి రోజు విగ్రహానికి పూలమాల వేయడానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. సొంత గ్రామంలో కూడా రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహం అడ్డంగా ఉందని తొలగించి ఇంతవరకు ప్రతిష్టించలేదన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేస్తున్నారన్నారు. విగ్రహం కూల్చివేతపై నిరసనకు దిగిన మంద కృష్ణ మాదిగను అరెస్టు చేశారన్నారు. ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియచేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎమర్జన్సీ రోజులు నడుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ? లేక నియంత రాజ్యంలో ఉన్నామా ? అని ఆయన నిలదీశారు. రాష్టప్రతి, ప్రధానమంత్రి కూడా అంబేద్కర్ జయంతి రోజు చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముఖ్యమంత్రులు జయంతి రోజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించేవారన్నారు. ఉస్మానియా వర్శిటీలో నిరుద్యోగులైన విద్యావంతుల ప్రదర్శనకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఖమ్మంలో గిట్టుబాటుధరలను పంట ఉత్పత్తులకు ఇవ్వాలని అడిగినందుకు రైతులను అరెస్టు చేశారన్నారు. అంబేద్కర్ దళితులకే కాకుండా యావత్తు భారతావనికి నాయకుడని ఆయన అన్నారు.
చిత్రం... ట్యాంక్‌బండ్‌పై గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు