తెలంగాణ

కొత్త మండలాలకు రిజర్వేషన్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు మండలాలకు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు పంచాయతీరాజ్‌శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలకు రిజర్వేషన్లను ఖరారు చేయకపోవడంతో తాజాగా వాటికి కూడా ఖరారు చేసింది. నిజామాబాద్ జిల్లా మెస్రా, చండూరు సిద్దిపేట జిల్లా నారాయణపేట, మేడ్చెల్ జిల్లా చింతలపల్లి మండలాలు ఉన్నాయి. ఇలా ఉండగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల 6 నుంచి మూడు విడతల్లో 14వ తేదీ వరకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.