తెలంగాణ

ఆర్థిక అవగాహనతోనే మహిళలకు సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: దేశాభివృద్థిలో ప్రతి అడుగులో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛందసేవా సంస్థలు మహిళలకు ఆర్థిక అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ మహిళా సాధికారత అంశంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్థి సంస్థలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా ఉన్న భారతదేశం వృద్ధిరేటు 2020 నాటికి 7.5 శాతానికి పెరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ మేరకు అంచనా వేసిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల డాలర్ల ఆర్థికాభివృద్ధిని దేశం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. మహిళా భాగస్వామ్యాన్ని మరింత పెంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రమేయం లేకుండా సామాజిక మార్పు సాధ్యం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. బాలికలు, మహిళలకు ఆర్థిక అవగాహన కల్పించాలంటే వారిని అన్ని కార్యక్రమాల్లో
భాగస్వాములను చేయాలన్నారు. లింగ సమానత్వం అనేది పౌరులకు సంబంధించిన అంశమన్నారు. అది కేవలం మహిళలకు మాత్రమే సంబంధించినదిగా భావించవద్దన్నారు. సమాజాభివృద్ధికి స్ర్తి పురుషులిద్దరూ రెండు బండి చక్రాల వంటి వారన్నారు. సమాజంలో ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకమైనదన్నారు. దేశాభివృద్ధికి సంపద సృష్టి అత్యంత ఆవశ్యకమని చాణుక్యుడు ఏనాడో తెలిపారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని భారత్ ఆకర్షిస్తోందని, రానున్న 10 నుంచి 20 ఏళ్లలో భారతదేశ ఆర్థికాభివృద్ధి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన చెప్పారు. మహిళల సమాన భాగస్వామ్యం లేకుండా వ్యవసాయ రంగం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం కీలకమైందన్నారు. డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రజలు క్రమంగా చైతన్యవంతం అవుతున్నారన్నారు. ఇదే క్రమంలో ఆర్థిక నేరాలు, సాంకేతిక నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం అంకురం సంస్థలకు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా అవతరించిందన్నారు. ఈ దిశగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు.