తెలంగాణ

పరిషత్ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: వచ్చే నెలలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల అధ్యక్ష పదవులను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు ప్రారంభించాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ డీలా పడడంతో పార్టీ కేడర్ నిరుత్సాహంతో ఉంది. నాలుగు నెలల విరామంతో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని గ్రహించిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కసారిగా పార్టీ కార్యకలాపాలను ఉధృతం చేశాయి. పరోక్ష పద్ధతిలో జరిగే పరిషత్ ఎన్నికల్లో దాదాపు అన్ని జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్ష పదవులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి వినూత్న రీతిలో పరిషత్ ఎన్నికల్లో వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. సెలెక్ట్, ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కమిటీలకు అప్పగిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారకుండా ఉండేందుకు అఫిడవిట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అఫిడఫిట్ విధానంపై పరిశీలన చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పార్టీలు మారడంతో ఆ పార్టీ కేడర్‌లో నిరాశ ఆవరించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేయలేని స్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు త్వరలో జిల్లాల పర్యటన చేయనున్నారు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ మాట్లాడుతూ ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీపీ, ఎంపీపీ అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరపాలని కోరారు. మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో జడ్పీటీసీ సభ్యుల కంటే, ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గతంలో మొత్తం స్థానాల్లో నాల్గవ వంతు కంటే మించి ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉండేవారు కారు. కాని కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెరిగినా, ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరగదు. ఈ జిల్లాల్లో 50 నుంచి 60 శాతం సభ్యులు ఎక్స్‌అఫీషియో సభ్యులే ఉంటారు. దీనివల్ల అధికార పార్టీ గెలుపు సులువవుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది సరైన సమయం కాదంటూనే బీజేపీ సిద్ధమవుతోంది. జిల్లా పదాధికారుల సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచారు. అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధిస్తామని, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును చూసి భయపడి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్ నుంచి చాలామంది బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు.