తెలంగాణ

వడగళ్ల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలతో పాటు మార్కెట్ యార్డులు, రైతులు ఆరబోసిన ధాన్యం తడవడం వల్ల అపార నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరిపైర్లు నేలకొరిగి ధాన్యం నేలపాలుకాగా, కోతకు సిద్ధంగా మామిడి కాయలు, పండ్లు గాలివాన, వడగళ్లకు నేలరాలడం, అలాగే కూరగాయల పంటలు పూల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. జరిగిన నష్టంపై పూర్తిస్థాయి నివేదికలు పంపించాల్సిందిగా కలక్టర్లను కోరింది. ఇలా ఉండగా మార్కెట్ యార్డులతో పాటు ధాన్యం తడవకుండా అధికారులు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మరో రెండు, మూడు రోజుల పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలా ఉండగా గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రాష్టవ్య్రాప్తంగా ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వడగ వానకు పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలకు అపార నష్టం వాటిల్లింది. కరీంనగర్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉండగా ఇతర మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పండ్ల తోటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం అందింది. సిద్దిపేట జిల్లా ములుగు, గజ్వేల్ మండలాల్లో, కరీంనగర్ జిల్లా మానకొండూరు, చిగురుమామిడి, కొత్తపల్లి, శంకరపట్నం, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, హుజురాబాద్ మండలాల్లో పండ్ల తోటలతో పాటు మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం తడిసినట్టు సమాచారం. మార్కెట్ యార్డులు ఐకేపి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్ద అయిందని రైతన్నలు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప జరిగిన నష్టం నుంచి తేరుకోలేమని రైతులు ప్రాధేయ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, శంషాబాద్, కొత్తూరు, షాద్‌నగర్ మండలాల్లో మామిడి తోటలతో పాటు పూల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. వడగళ్ల వానకు జరిగిన నష్టంపై అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చర్చించారు. జిల్లాల వారీగా జరిగిన నష్టంపై ఆరా తీశారు. మార్కెట్ యార్డులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులలో ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కప్పి ఉంచడానికి టార్పాలిన్ల సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కూడా టార్పాలిన్ కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బ్యాటరీ లైట్లు, జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ యార్డులలో అధికారులు రైతులకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.

రెండు, రోజుల పాటు ఇదే పరిస్థితి: వాతావరణశాఖ
చత్తీస్‌గడ్ నుంచి కోస్తా కర్నాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తూర్పు విదర్భ, తెలంగాణ, కర్నాటక వరకు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే బంగాళఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కారణంగా రాబోయో రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు, ముఖ్యంగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.