తెలంగాణ

రైతులకు అండగా సర్కారు : నిరంజన్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ఆయన సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్ తదితర శాఖలు సమష్టిగా ప్రణాళికలను రూ పొందించుకోవాలని సూచించారు. పంటల సాగునుండి ఉత్పత్తి, అమ్మకం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులు మార్కెట్లకు తీసువచ్చే పంటలకు ఆ యా శాఖలు వెంటనే డబ్బు చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని గోదాములన్నీ వేర్‌హౌజింగ్ శాఖ అధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మలక్‌పేట ఉల్లిగడ్డల మార్కెట్‌ను పటాన్ చెరుకు, గడ్డిఅన్నారం పళ్లమార్కెట్‌ను కోహెడకు, ఖమ్మం మిర్చి యార్డ్‌ను మద్దులపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. వనపర్తిలో కొత్తగా మార్కెట్ యార్డును నిర్మించాలన్నారు. కొత్తగా నిర్మించే ప్రతి మార్కెట్ యార్డుకు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మార్కెట్ ఫీజులను ఎక్కడా ఎగవేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న 60 కూరగాయల కేంద్రాలకు తోడుగా మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...మార్కెటింగ్ శాఖ సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి