తెలంగాణ

నీట్‌లో మంచి ఫలితాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రం నుండి ఈసారి నీట్‌లో మంచి ఫలితాలను ఆశిస్తున్నట్టు ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలకే పరిమితం కాకుండా ఎమ్సెట్ వంటి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రామచంద్రం అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ కృషి చేయడం మంచి పరిణామమని , విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మెయిన్ ఎమ్సెట్‌లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, అధ్యక్షుడు బీసీ మూర్తి, ఎజీఎం కుమార్, శివకుమార్, టీ రవి, నగర కార్యదర్శి ఎండీ జావేద్, అశోక్‌రెడ్డి, పగడాల లక్ష్మయ్య, శోభానాయక్ తదితరులు పాల్గొన్నారు.