తెలంగాణ

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలును ఘనంగా నిర్వహించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు కేక్‌ను కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు గరికపాటి మోహనరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్, మీడియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, కార్యదర్శులు బుచ్చిలింగం, బండ్రు శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి, అధికార ప్రతినిధి పుల్లారావు, ఆజ్మీర్ రాజునాయక్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయిబాబా రవీంద్రచారి పాల్గొన్నారు.