తెలంగాణ

పంట నష్టపోయన రైతాంగాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్టవ్య్రాప్తంగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పీ జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్ పేర్కొన్నారు. వీటితో పాటు మార్కెట్ యార్డుల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని, చేతికొస్తుందనుకున్న పంటను కూడా రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో విరిగిన కరెంట్ స్తంభాలను పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, ఆలస్యం చేస్తే రైతులు మరింత నష్టపోతారన్నారు.