తెలంగాణ

రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంటలకు జరిగిన నష్టంపై వివరాలు సేకరించి రైతులను అదుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులకు ప్రభుత్వ విధానాన్ని తెలియచేశానని చెప్పారు. వానల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రధాని ఫసల్ బీమా యోజన కింద పరిహారం ఇప్పిస్తామన్నారు. ఇందుకోసం పూర్తి వివరాలు పంపించాలని కోరామని చెప్పారు. ఇలా ఉండగా ప్రస్తుత వర్షాల వల్ల వరిధాన్యం ఎక్కువగా తడిసిపోయిందని, ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని రైతులు సరైన పద్ధతిలో మార్కెట్‌కు తీసుకురావాలని, మార్కెట్లలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంటోల్ రూం (టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 00333) కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చన్నారు. వాట్సప్‌కు కూడా ఫోన్ (73307 74444) చేసి సమాచారం ఇవ్వవచ్చని వివరించారు. జిల్లా స్థాయి అధికారులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సబర్వాల్ సూచించారు.