తెలంగాణ

నరమేధం అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కొలంబోలో ఆదివారం జరిగిన నరమేధం అమానుషమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తదితరులు వేరువేరు ప్రకటనల్లో వ్యాఖ్యానించారు. ఈ సంఘటన పట్ల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబోలో వరుస బాంబు దాడుల కారణంగా వందలాది మంది మరణించడానికి, తీవ్రంగా గాయపడడానికి కారణమైన ఉగ్రవాద చర్యను ఖండించారు. ఉగ్రవాదానికి కులం, మతం ఉండదని అన్నారు. ఈస్టర్ డే సందర్భంగా ప్రార్థనలు చేసుకునే వారిపై దుండగులు బాంబులతో దాడి చేయడం తీవ్రమైన చర్యన్నారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు మానవాళికి తీవ్ర విఘాతం కల్గిస్తాయన్నారు. క్రైస్తవులు పవిత్రంగా కొలిచే ఈస్టర్ పర్వదినాన్ని ఇలా రక్తసిక్తం కావడం పట్ల తాను కలత చెందామన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తుదముట్టించాల్సిందేనన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు బీజేపీ రాష్ట్ర శృఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తూ, మరణించిన వారి ఆత్మలకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.