తెలంగాణ

ఏడుపాయల దుర్గకు ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఏప్రిల్ 21: శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని చెక్‌డ్యామ్, ఘణపురం ఆనకట్టలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో వివిధ రకాల పూలు, పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. తెలంగాణలోని హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు తరలిరావడంతో ఎటు చూసిన జనమే కనిపించారు.