తెలంగాణ

గోదావరి జలాలతో అమ్మకు అభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 21 : సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయక్ సాగర్ జలాశయం భవిష్యత్‌లో పసిడిపంటల సిరి కాబోతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రంగనాయక్ సాగర్ చంద్లాపూర్ గ్రామ రేణుక మాత ముంపుకు గురవుతున్న సందర్భంగా గ్రామంలో నూతన దేవాలయ నిర్మాణానికి ఆదివారం మాజీ మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఈప్రాంత కరువును పారాదోలే గొప్ప రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ అన్నారు. దేవుళ్ల దీవేన ఉంటే ఏంతటి కార్యమైన నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నారు. గ్రామంలోని రంగనాయక స్వామి, ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక్ సాగర్‌తో వచ్చే గోదావరి జలాలతో ఎల్లమ్మ తల్లికి అభిషేకం చేస్తానన్నారు. ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో ఈ ప్రాంతమంత ఆకుపచ్చ ప్రాంతంగా కావాలన్నారు. ఆ తల్లి దీవేనతో వర్షాలు సమృద్ధికురిసి, ఈ ప్రాంత కరువు పోవాలని ఆకాంక్షించారు. రంగనాయక్ సాగర్ జలాశయంతో పసిసిడి పంటల సిరి కాబోతుందని హరీష్‌రావు అన్నారు. ఎల్లమ్మ దయతో ఈ ప్రాంత ప్రజలు సుభీక్షంగా ఉండాలని, గ్రామాభివృద్ధి జరుగాలని ఆకాంక్షించారు.