తెలంగాణ

నిజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నారని, ముందస్తు ఎన్నికలకు ఎందుకువెళ్లారో ముఖ్యమంత్రి ఇప్పటికైన నోరు విప్పాలని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవి శ్యాంసుందర్‌రావు ఆద్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికలను పురస్కరించుకుని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రాదేశిక ఎన్నికలలో అన్ని స్థానాలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలన్నారు. 1500 మంది త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారి ఇష్టానుసారంగా చేపడుతున్న నిరంకుశపాలన విదానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం సచివాలయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
శాసనసభకు కాలపరిమితి ఉండగానే ముందస్తుకు ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్ అయిదు సంవత్సరాల పాలనలో స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ నిధులు తప్ప పైసావిదల్చని కేసీఆర్ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే జడ్పీటీసీ, ఎంపీటీసిల ఎన్నికలకు తొందరపడుతున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. రానున్న ప్రాదేశిక ఎన్నికలలో బీజేపీ సత్తాను చాటి యాదాద్రి భువనగిరి జిల్లాపరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకపోవడంతో ఆకాల వర్షానికి పంటనష్టపోయిన రైతులు నష్టపరిహారం పొందలేక తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గాని, రాష్ట్ర మంత్రులుగాని అకాలవర్షం, వడగండ్లవానతో నష్టపోయిన రైతులను పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. బ్యాంకులో తీసుకున్న రుణాలు మాఫీకాక, తిరిగి పంట రుణాలు పొందలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. పోలింగ్‌రోజున చేతికి పెట్టిన ఇంకు ఆరకముందే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఎస్పీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం అంబేద్కర్ రాజ్యాంగస్ఫూర్తికే విరుద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేదని ఆ పార్టీ గుర్తుపై గెలుపొందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడమే నిదర్శనమన్నారు.
దేశంలో నానాటికి క్షీణిస్తున్న కాంగ్రెస్ తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడంలో విఫలమయ్యారని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కాచం వెంకటేశ్వర్లు, వేముల అశోక్, కర్నాటి ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో ఎండిన వరి కంకులను చూపుతున్న కిషన్‌రెడ్డి