తెలంగాణ

2023 వరకు టీఆర్‌ఎస్ సర్కారు సాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 వరకూ ఉండదని, మధ్యలోనే కూలిపోవడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జ్యోస్యం చెప్పారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్ లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి సొమ్మును ఎమ్మెల్యేల ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. తమకు 100 ఎమ్మెల్యేల బలం ఉందని అనుకుంటున్న కేసీ ఆర్ 2023 వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూప్పకూలక తప్పదని హెచ్చరించారు. గత నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ప్రస్తుతం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ విధానాలు నచ్చక పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,7 నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజలు అండగా నిలిచారని తప్పకుండా గెలిచే అవకాశం ఉందన్నారు. అందులో మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం కూడా గెలిచి తీరుతామని అన్నారు. దేశంలో ఎక్కడా ఉగ్రవాద దాడులు జరిగిన ఆ మూలాలు హైదరాబాద్‌కు లింకు ఉండడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల మూలాలను అనగదొక్కడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇటీవల వెల్లడి అయిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు గందరగోళానికి దారి తీశాయని ఇందుకు ప్రభుత్వమే బాద్యత వహించాలని హెచ్చరించారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీ ఆర్ స్పందించాలని, ఇంటర్మీడియట్ ఫలితాలపై న్యాయ విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు అవినీతిమయంలో కూరుకుపోయిందని ఆరోపించారు. రెవిన్యూ శాఖలో అవినీతి జరుగుతుందని కేసీ ఆర్ అంటున్నారని, అవినీతి జరగకుండా చర్యలు చేపట్టాలి తప్పా ఆ శాఖనే లేకుండా చేస్తామని అనడం ఏమిటని ప్రశ్నించారు. తలకాయపై ఏదో పుండు వచ్చిందని తలకాయనే తీసివేస్తానని చెప్పడం ఏమిటని పుండు బాగు చేయడానికి చికిత్స అవసరమని ఆయన సూచించారు. ఆసలు కేసీ ఆరే ఒక అవినీతి పరుడని అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా పరిపాలన సాగాలంటే ముందుగా చేసిన అవినీతి బయట పెట్టాల్సిందేనని, కేంద్రంలో మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావడం ఖాయమని ఆ తరువాత కేసీ ఆర్ అవినీతిపై కొరడా ఝూలిపించడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను దారి మళ్లించి తమ పథకాలని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామని తెలుసుకున్న కేసీ ఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీల్లో ఒక స్పష్టత వచ్చిందని ఇక్కడ టీడీపీకి స్థానం లేదని ఆ పార్టీ తెలంగాణలో మునిగిపోయిందని ఆరోపించారు. ఇక టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం తెలంగాణలో బీజేపీకి తప్పా మరే పార్టీకి లేదని, ప్రత్యమ్నాయ పార్టీ రాష్ట్రంలో బీజేపీ అని ఆయన తెలిపారు. కుటుంబ పార్టీ అయిన టీ ఆర్ ఎస్‌కు పతనం ప్రారంభమైందని విమర్శించారు. మాజీ మంత్రి డీ.కె అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్, నాగురావు నామాజి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో
మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్