తెలంగాణ

ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మెజార్టీ స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 22: రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటడం ఖాయమని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలని సూచించారు. ప్రాదేశిక ఎన్నికలో మాయమాటల కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు గతంలో 34 శాతం ఉంటే నేడు 20 శాతం బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే కేసీఆర్ కోర్టుకు వెళ్లకుండా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల కో-ఆర్డినేటర్ ఫయిమ్ జిల్లా అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, వాసుదేవరావు, ధరావత్ రాజేష్‌నాయక్, నాగుల వాసు పాల్గొన్నారు.