తెలంగాణ

సిద్దిపేట జడ్పీ చైర్మన్‌గా వేలేటి రోజాశర్మ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 22: సిద్దిపేట జిల్లా పరిషత్ తొలి మహిళా చైర్మన్‌గా వేలేటి రోజాశర్మను దాదాపుగా ఖరారు చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధకిషన్‌శర్మ సతీమణీ రోజాశర్మ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిషత్ జనరల్ మహిళకు రిజర్వు అయంది. గతంలో ఎంపీపీగా పనిచేసిన రోజాశర్మకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తానని సీఎం కేసీఆర్ హమీ మేరకు సోమవారం రోజాశర్మ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి జిల్లా విద్యాశాఖాధికారి రవికాంత్‌రావుకు అందచేశారు. రోజాశర్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉన్నత విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట నియోజక వర్గం చిన్నకోడూరు మండలం నుండి టీఆర్‌ఎస్ పార్టీ నుండి జడ్పీటీసీగా పోటీ చేయనున్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండల కేంద్రానికి చెందిన రోజాశర్మ ఎమ్మెస్సీ,బీఈడీ విద్యను అభ్యసించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం వేలేటి రాధకిషన్ శర్మను వివాహం చేసుకున్నారు. 1995లో చంద్లాపూర్ నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీటీసీగా పోటీ చేసి, చిన్నకోడూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా 1995-2000 వరకు పనిచేశారు. అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. 2000లో రోజాశర్మ ఎంపీపీగా పదవి విరమణ ఆనంతరం 2001 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా ఎన్నికైనారు. 2002 జనవరి 23న టెక్మాల్ మండలం ఎల్లంపల్లిలో ఉపాధ్యాయురాలుగా విధుల్లో చేరారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు.
జడ్పీటీసీ బరిలో రోజాశర్మ
సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వు కాబడింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశీంచిన పార్టీ ముఖ్యనేతలు తమ సతీమణులను కట్టబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు విదేయుడిగా ఉన్న రాధాకిషన్‌శర్మకు అవకాశం వరించింది. మాజీ మంత్రి హరీష్‌రావు, వేలేటి రాధకిషన్‌శర్మలు కేసీఆర్ చర్చించిన తర్వాత జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టెందుకు హామీనిచ్చినట్లు సమాచారం. దీంతో సోమవారం రోజాశర్మ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. చిన్నకోడూరు జడ్పీటీసీగా ఈనెల 24న బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ నాడే రోజాశర్మను జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చిన్నకోడూరు మండలం జడ్పీటీసీగా రోజాశర్మ విజయం నల్లెరుపై నడకగా చెప్పవచ్చు. జిల్లా పరిషత్ తొలి చైర్మన్ సిద్దిపేట ప్రాంతానికి దక్కనుండటంతో ఈప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం... డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా సమర్పిస్తున్న వేలేటి రోజాశర్మ