తెలంగాణ

విద్యాశాఖ మంత్రిని డిస్మిస్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో తలెత్తిన వైఫల్యాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వాకమే నిదర్శనమని, ఇంటర్ బోర్డు తప్పులతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, మరెందరో విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు. ఇంటర్మీయట్ ఫలితాల తీరుపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి నిర్లక్ష్యంగా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని, విద్యాశాఖ మంత్రి తమ జిల్లా వారు కావడం ఈ జిల్లా ప్రజలకు సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను తనవద్దే ఉంచుకుని రెవెన్యూ శాఖ అవినీతియమమైందంటు, ఉద్యోగులు అవినీతిపరులంటు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కీలకమైన రెవెన్యూ శాఖకు మంత్రిని నియమించకుండా సీఎం కేసీఆర్ స్వయంగా రెవెన్యూ శాఖ పరిపాలనను అస్తవ్యస్తం చేశారన్నారు. ఎంతసేపు ఎన్నికల్లో గెలువడం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రాజెక్టుల రీడిజైన్లతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి కోట్లు దండుకోవడం మినహా సీఎం కేసీఆర్ రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టడం లేదంటు కోమటిరెడ్డి విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఫామ్‌హౌస్, ప్రగతిభవన్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్ రాజ్యంగ, పాలన, శాసన వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చుతున్నారన్నారు. అకాల వర్షాలతో పంటలు, తోటలు నష్టపోయి రైతులు అల్లాడుతుంటే వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుల ఫలితాలతో ఆందోళన చెందుతుంటే వారిగోడు కేసీఆర్‌కు వినిపించడంలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అసంతృప్తికి అద్దం పట్టాయని, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు తధ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరు పార్టీ నుండి వెళ్లిపోయినా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఏమి కాదన్నారు. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని వారికి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ, తిప్పర్తి, కనగల్ జడ్పిటీసీ అభ్యర్థులు వంగూరి లక్ష్మయ్య, పాదూరి శ్రీనివాస్‌రెడ్డడ్డి, గుండెబోయిన భిక్షం యాదవ్, మాజీ జడ్పీటీసీ నార్సింగ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి